ఉత్తమ్‍కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్

కోవిడ్ లక్షణాలుండి ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ టెస్టులలో నెగిటివ్ వచ్చిన వారు సిటిస్కాన్ చేయించుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‍కుమార్ రెడ్డి సూచించారు. తనకు సిటీ స్కాన్ ద్వారానే కోవిడ్ నిర్థారణ అయిందని వెల్లడించారు. తన విషయంలో ఆర్టీపీసీఆర్/రాపిడ్ టెస్టులు రెండూ కరోనాను నిర్ధారించడంలో విఫలమయ్యాయని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేసుకోవాలని ఉత్తమ్ కోరారు. కరోనాతో గచ్చిబౌలి ఎఐజీ ఆసుపత్రిలో ఉత్తమ్ కుమార్‍రెడ్డి చేరారు. ఈ సందర్భంగా పలువుకు కాంగ్రెస్ నేతలు ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.