సమాజ అభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిది : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మహిళ అభ్యున్నతి కోసం ఎప్పుడూ పాటుపడుతుందని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత కల్పించిందన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం సోనియా గాంధీ ప్రయత్నిస్తే, ప్రధాని మోదీ తొక్కిపెట్టారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా చట్ట సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేస్తామన్నారు. మహిళల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. తెలంగాణను వ్యసనపరుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో గల్లీల్లోనూ గంజాయి, మందుసీసాలు దొరుకుతున్నాయని, రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి అందరూ కదిలిరావాలని పిలుపునిచ్చారు.













