ఈ నెల 25 వరకు దరఖాస్తుల స్వీకరణ : రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు నమూనాను రేవంత్ విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము రూ.25 వేలుగా నిర్ణయించాం. బీసీ, ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.50 వేలు. అర్జీల స్వీకరణ తర్వాత అర్హులైన వారిపై సర్వేలు చేయిస్తాం. ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపుతాం. స్క్రీనింగ్ కమిటీ తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అక్కడ కూడా అభ్యర్థి ఎంపిక తేలకపోతే సీడబ్ల్యూసీకి పంపుతారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే. నమూనా దరఖాస్తును ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు అని తెలిపారు.













