ఏ రాష్ట్ర గవర్నర్ కు లేని అధికారాలు.. తెలంగాణ గవర్నర్ కు
రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు, తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ఢిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. గవర్నర్ తక్షణమే తన అధికారాలనను ఉపయోగించుకోవాలని సూచించారు. కుటుంబంలో ఉన్న ససమ్యలను తప్పించుకునేందుకు కేసీఆర్ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారన్నారు. కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమని, కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెబుతున్నారన్నారు.
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారంటే, తెలంగాణలో వైద్యం పడకేసినట్లే కదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వర్సిటీల్లో ఖాళీలున్నాయని గవర్నర్ అఫీషియల్‌గా నివేదిక ఇచ్చిందని తెలిపారు. గవర్నర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వాళ్లు బీజేపీ అని తెలియదా? ప్రశ్నించారు. గవర్నర్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించారు. కేవలం సీఎం కేసీఆర్‌కు కోపం వస్తుందనే హైదరాబాద్‌లో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేడుకలకు హాజరు కాలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఫిర్యాదు చేయాల్సింది. అప్పుడు ఇక్కడి కుమ్మక్కు రాజకీయాలు బహిర్గతం అయ్యేవి అని పేర్కొన్నారు.













