ఆ విషయం మంత్రి కేటీఆర్కు.. తెలియకపోవడం బాధాకరం
అన్నదాతల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధత మంత్రి కేటీఆర్కు తెలియకపోవడం బాధాకరమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడయాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో సీఎం కేసీఆర్ తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం, కనీస మద్దతు ధర, నిత్యావసర వస్తువుల చట్ట,స్త్రం ఉపాధి హామీ, సమగ్ర పంటల భీమా, ఆహార భద్రత, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఎవరి ఘనత అని ప్రశ్నించారు. రూ.70 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. ఇక్రిశాట్ వంటి సంస్థల ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని పేర్కొన్నారు. భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయడం పెద్ద సమస్యేమీ కాదని వెల్లడించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
.













