అమెరికా పారిశ్రామికవేత్తలతో తెలంగాణ మంత్రుల భేటీ
తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారవేత్తలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రులు సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడిగే కలిగే లాభాలను వివరించిన మంత్రులు, కంపెనీలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు ఇస్తున్నామని, హైదరాబాద్ అన్నిరకాల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమన్నారు. హైదరాబాద్ ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మంజూరైందని, ఇది తెలంంగాణ గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు. రానున్న కాలంలో హైదరాబాద్‌ను నలు దిశలా అభివృద్ధి చేస్తామని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలన్న ప్రయత్నంలో ఉన్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పారిశ్రామికవేత్తలు తెలిపారు.













