ప్రొ. కోదండరాం సంచలన ప్రకటన.. ఏ పార్టీతోనైనా
వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సిద్దమని ప్రొ. కోదండరాం సంచలన ప్రకటన చేశారు. సూర్యాపేటలో జరిగిన తెలంగాణ జన సమితి మూడవ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను గద్దె దించడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. తమ ప్రధాన లక్ష్యం ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే అన్నారు. ఇందు కోసం తాము ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కోదండరాం ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.













