మునుగోడు ఉప ఎన్నిక పోటీపై.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. టీజేఎస్ కార్యాలయంలో చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ ఉప ఎన్నికతో రాష్ట్రానికి, ప్రజలు ఉపయోగం లేదన్నారు. నాయకుల స్వార్థం కోసమే మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని మునుగోడు ప్రజలకు వివరిస్తామన్నారు.













