కట్టడానికి కాదు… కూల్చడానికి ముహూర్తమా?
ఎవరైనా కట్టడానికి మంచి ముహూర్తం చూస్తారు. కానీ, కూల్చడానికీ చూస్తారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ నుద్దేశించి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవా చేశారు. కోదండరాం జన్మదినం సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. సొంతంగా తమ పార్టీ బలపడ్డాకే ఇతర పక్షాలతో పొత్తుల గురించి మాట్లాడుతామని తెలిపారు. ఇంటింటికి జనసమితి కార్యక్రమాన్ని చేపట్టేందుకు 50 నియోజకవర్గాలను గుర్తించామని, తొలివిడతగా 25 స్థానాల్లో నేతలకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ప్రగతికి పది సూత్రాల పేరుతో టీజేఎస్ మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని తెలిపారు.













