కేసీఆర్ జాతీయ పార్టీ.. పీకే పార్టీ ఒక్కటే
కేసీఆర్ జాతీయ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కటేననే అనుమానం కలుగుతుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రంపై కోదండరాం స్పందించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కోసం పీకేను వాడుకుంటున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలనేది ప్రొఫెసర్గా తన అభిప్రాయమన్నారు. రాహుల్ గాంధీ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని తెలిపారు. వివిధ పార్టీల నాయకుల రాకతో యూనివర్సిటీ విద్యార్థులకే మేలు జరుగుతుందని తెలిపారు. యూనివర్సిటీలో సభలకు అనుమతి అనేది పూర్తిగా వర్సిటీ అధికారులదే బాధ్యతని అన్నారు. రానున్న ఎన్నికల కోసం 25 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీచేస్తామని తెలిపారు.













