ఆ రోజున పాతబస్తీలో తిరంగా యాత్ర : ఒవైసీ
సెప్టెంబరు 17న హైదరాబాద్ పాతబస్తీలో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్టు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన రోజు అని తెలిపారు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించిందని, అలా కాకుండా సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని కోరారు. విమోచన దినోత్సవంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖలు రాశామని తెలిపారు. తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలసి పోరాడారని గుర్తు చేశారు. తురేబాజ్ఖాన్ వీరోచిత పోరాటం చేశారని వివరించారు. ఎంఐఎం నిర్వహించే బహిరంగ సభలో పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని తెలిపారు.













