హైదరాబాద్ కు ప్రధాని మోడీ రాక.. భారీ బందోబస్తు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకొని హెలికాప్టర్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆవరణలో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో గచ్చిబలిలోని ఐఎస్బీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంతో ఐఎస్బీఐతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్ఐసీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్బీలోనే 2వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్చార్జి కమిషనర్ సీవీ ఆనంద్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.













