తెలంగాణ శాసన మండలి కీలక నిర్ణయం
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్లను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు మండలి చైర్మన్ తేల్చడంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు. అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్లో చేరిన కొండా మురళి రాజీనామాను ఇప్పటికే ఆమోదం తెలిపారు.













