ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు …జనవరిలో

ప్రపంచ తెలుగు సమాఖ్య 12 ద్వివార్షిక అంతర్జాతీయ మహా సభలు జనవరి 3-5 వరకు మాదాపూర్ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సమాఖ్య చైర్‌పర్సన్ వీఎల్ ఇందిరాదత్ తెలిపారు. మాదాపూర్ లోని హోటల్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ 45 దేశాల్లోని 150 ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. కార్యక్రమాల్లో భాగంగా సినీ, పారిశ్రామిక తదితర రంగాల తెలుగు ప్రముఖులను సత్కరించనున్నట్లు వెల్లడించారు. నిర్వహణ కమిటీ ప్రతినిధులు సాయి, విజయలక్ష్మి, హారిస్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాఖ్య అనుబంధ సంఘాల ప్రతి నిధులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది వరకు హాజరుకానున్నట్లు తెలిపారు. అనుబంధ సంఘాల ప్రతినిధుల సమావేశాలు, వ్యాపార, పారిశ్రామికవేత్తల సదస్సులు ఉంటాయని, వారితో యువతకు ముఖాముఖి కార్యక్రమాలూ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ వైస్ చైర్‌పర్సన్ కవిత దత్ పాల్గొన్నారు.