తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మూడు కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమించింది. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మన్నె క్రిశాంక్‌ను, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా డా.ఎర్రోళ్ల శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా సాయిచందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవుల్లో వీరు రెండేళ్ల పాటు కొనసాగుతారని తెలిపింది. మన్నె క్రిశాంక్ సర్వే సత్యనారాయణ అల్లుడు. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, వీదా సాయిచందర్ ప్రముఖ జానపద గాయకుడు.













