భారతీయుల బంధం విడదీయలేనిది : అమెరికా కాన్సులేట్
అమెరికాతో భారతీయుల బంధం విడదీయలేనిదని యూఎస్ కాన్సులేట్, హైదరాబాద్ ప్రజాసంబంధాల అధికారి డేవిడ్ మేయర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర అనే అంశంపై అమెరికన్ కాన్సులేట్ పలువురు పాత్రికేయులతో నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగిస్తూ.. అమెరికాలోని అన్ని వ్యవహారాల్లో భారతీయులు విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నారన్నారు. అమెరికా సంస్క•తి, సంప్రదాయాల్లో భారతీయుల దశాబ్దాలుగా మమేకమయ్యారని వ్యాఖ్యానించారు. అలాగే దక్షిణాసియాలో అమెరికా కు భారత్ కీలక భాగస్వామి అని తెలిపారు.













