ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలను విడివిడిగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేయించి గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సహకరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. జేఏసీ ప్రతినిధులు రవి గౌడ్, పి.స్వదేష్, కృష్ణ, ధర్మేందర్, మంద భీమ్‌రెడ్డి, నరేష్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నారై డిపార్టుమెంట్ అధికారి చిట్టిబాబును కూడా కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారొక ప్రకటనలో తెలిపారు.