ఫిబ్రవరి 6న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఆరో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 :30 గంటలకు శాసనసభలో మంత్రి హరీశ్‌రావు, మండలిలో వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభమయ్యే ఉభయసభల సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. సోమవారం జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసై అభిప్రాయాల మేరకు శాసనసభ సమావేశాలు, బడ్జెట్, గవర్నర్ ప్రసంగాల విషయంలో ఈ మేరకు మార్పులు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













