హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలైన కృతిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్‌పై (ఏఐఆర్) అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 10-12 తేదీల్లో హైదరాబాద్ అంతర్జాతీయ సమావేశ మందిరం (హెచ్ఐసీసీ)లో ఏఐఆర్ సదస్సు జరుగుతుందని, ఈ రంగంలోని ప్రముఖులు ఇందులో పాలుపంచుకుంటారని సదస్సును నిర్వహిస్తున్న అవుట్విట్ అవుట్ ప్లే ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎండీ మాధుర్ కృష్ణ గోయెల్ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతు అందిస్తోంది. వివిధ దేశాల నుంచి ఈ రంగాలలోని నిష్ణాతులు, రాష్ట్రాల ఐటీ కార్యదర్శులు, ఇతర భాగస్వాములు పాలుపంచుకుంటారు.













