ఎన్నారై పాలసీ తెస్తున్న సీఎంకు కృతజ్ఞతలు
సమగ్ర ఎన్నారై పాలసీ తెచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం నుంచి విద్య, ఉపాధి కోసం ప్రజలు పలు దేశాలకు వెళ్లి సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి సహాయపడేందుకు సమగ్ర ఎన్నారై పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పారదర్శక, అవినీతిరహిత పాలన కోసం మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘన విజయం అందించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.













