Minister Komati Reddy: గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. చదువుల తల్లికి ఆర్థిక సాయం

పేద విద్యార్థిని ప్రణవి (Pranavi )చొల్లేటి విదేశాల్లో చదువుకోవటానికి తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) చేసిన సాయానికి ప్రతిస్పందిస్తూ విద్యార్థిని ప్రణవి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేద విద్యార్థిని ప్రణవికి ఇటలీ(Italy) లోని ప్రఖ్యాత విద్యాసంస్థ పాలిటెన్సికో డి టోరినో (పాలిటో)లో అర్కిటెక్చర్ కన్‌స్ట్రక్షన్ కళాశాలలో మాస్టర్స్‌లో సీటోచ్చింది. కానీ ఆర్థికంగా ఆమె తల్లిదండ్రులు ఇటలీ పంపించే ఆర్థిక స్తోమత లేదు. మంత్రి ఆర్థికంగా సహకరిస్తారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. విసయం తెలుసుకున్న మంత్రి ప్రణవిని జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి పిలిపించుకొని రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. అంతేకాదు ఆమె చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి సహాయంపై ప్రణవితో పాటు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.