తెలుగబ్బాయి.. అమెరికా అమ్మాయి.. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం
తెలుగు యువకుడు, అమెరికా అమ్మాయి ప్రేమించుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని హైదరాబాద్‌కు వచ్చారు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అబ్బాయి ఎల్ బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్న దేవిరెడ్డి నారాయణ రెడ్డి, అపర్ణా రెడ్డి దంపతలు కుమారుడు డాక్టర్ నితిన్. అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంతో నిపుణుడైన అతడికి అమెరికాకు చెందిన విడ్నీ స్నిడర్ (అనస్టీషియన్)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారటం, పెద్దలు అంగీకరించటంతో నార్సింగ్‌లో ఓ కన్వెన్షన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.













