ఈ నెల 23 నుంచి తెలుగు భాషా అమృతోత్సవాలు
తెలుగు భాషా సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలుగు భాసా అమృతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కడవటికంటి విజయ శామ్యూల్ తెలిపారు. ఇందులో భాగంగానే టంగుటూరి ప్రశాసం పంతులు జయంత్యుత్సవాలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, సాహితీవేత్త డా. వోలేటీ పార్వతీశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నందిని సిధారెడ్డిలతో పాటు 50 మంది సాహితీ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆగస్టు 20న గిడుగు రామమూర్తి పంతుల జయంత్యుత్సవాలు జరుగుతాయి, ఆయా కార్యక్రమాలకు సుద్ధాల అశోక్‌తేజ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు హాజరవుతారని తెలిపారు.













