వ్యూహకర్త సునీల్‌తో కాంగ్రెస్ ఒప్పందం?
జాతీయస్థాయి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న సునీల్ కనుగోలు సేవలను తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించుకోవాలని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చర్చలు కొలిక్కి వచ్చాయని, పార్టీకి సునీల్ కనుగోలు సేవలందిస్తారని కీలక నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు సునీల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా సునీల్ బృందం మొద టి దఫాలో తెలంగాణ, కర్ణాటకలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మాదా పూర్లో కార్యాలయం ప్రారంభించిన సునీల్ టీం ప్రతి పార్లమెంట్ నియెజకవర్గాన్ని ఒక్కో యూనిట్ గా తీసుకొని పనిచేయనున్నట్టు తెలుస్తోంది.













