సెప్టెంబర్ 17 నుంచి రెండో విడత ప్రజాపాలన : సీఎం రేవంత్

సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు రెండో విడత ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల కోసం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్‌తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్‌కార్డులు జారీ చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సూచించారు.