తెలంగాణలో వైసీపీకి బ్రేక్… అధ్యక్ష పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి గట్టు శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. ఆంధప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక సామాన్య కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన గొప్ప వ్యక్తి జగన్ అని కొనియాడారు. త్వరలోనే తాను జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీని ఆహ్వానిస్తూన్నా, ఆమెతో విభేదాలు లేవు.. బెస్ట్ ఆఫ్ లక్ అని గట్టు తెలిపారు.













