షోలాపూర్ మేయర్‌గా తెలంగాణ మహిళ
మహారాష్ట్రలోని షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా తెలంగాణకు చెందిన మహిళ ఎన్నికయ్యారు. షోలాపూర్ డివిజన్ నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన యెన్నం కాంచన (బీజేపీ) షోలాపూర్ మేయర్ పీఠాన్ని అధిరోహించారు. కాంచన స్వగ్రామం ఉమ్మడి మెదక్ జిల్లా లోని సదాశిపేట. చాలా సంవత్సరాల కిందటే వారి కుటుంబం షోలాపూర్‌కు వెళ్లింది. కాంచన భర్త యొన్న రమేశ్ దుప్పట్ల వ్యాపారం చేస్తుంటారు. కాంచన 2002లో మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. మహారాష్ట్రలో మేయర్‌గా ఎన్నికైన తొలి తెలంగాణ మహిళ కాంచన కావడం గమనార్హం.













