తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా సంగం మండలంలో రూ.26 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు చెప్పే మూర్ఖపు మాటలు విని ఎవరూ మోసపోవద్దని అన్నారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిరదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అక్కడి ప్రజలకు న్యాయం చేయని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.













