చంటి క్రాంతి కిరణ్ ను సన్మానించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
జర్నలిస్టు మిత్రుడు, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జర్నలిస్టు ఫోరంలో కీలక నేత, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ఆందోల్ శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించిన చంటి క్రాంతి కిరణ్ ను ఇవ్వాళ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) సన్మానించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ, TSPSC చైర్మన్ శ్రీ ఘంటా చక్రపాణి, ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగా రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీ కె. శ్రీనివాస రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు భండారు శ్రీనివాస రావు, రమణ, కట్టా కవిత, మైక్ టివి అధినేత అప్పి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













