ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు : ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఇంటర్ సెకండియర్ పరీక్షలపై ఊగిసలాట వీగిపోయింది. కరోనా దృష్ట్యా తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించాలా? వద్దా?అన్న అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం మంత్రులను, అధికారులను అడిగినట్లు సమాచారం. అయితే కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం తాజాగా ప్రకటన చేసింది. అయితే ప్రాక్టికల్స్‌లో విద్యార్థులందరికీ గరిష్టంగానే మార్కులు వేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా… పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడం అధికారులకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నట్లు అధికారులు సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.