దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం : కేంద్రం
మొక్కలు నాటడంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో దేశంలో 150.23 కోట్ల మొక్కులు నాటితే.. అందులో ఒక్క తెలంగాణలోనే 38.17 కోట్లు నాటినట్లు పేర్కొంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో 34.54 కోట్లు, యూపీలో 22.59 కోట్లు, ఏపీలో 17.05 కోట్ల మొక్కలు నాటినట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ జీసీ చంద్రశేఖర్ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సమాధానం ఇచ్చారు. మొక్కలు నాటడంలో తెలంగాణ ముందుండడానికి కృషి చేసిన అటవీ, ఇతర శాఖలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అభినందించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు అధిక సంఖ్యలో నాటుతున్నామని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.













