కాంగ్రెస్ లోకి రేవంత్ …ముహూర్తం ఖరారు?
తెలంగాణా తెలుగుదేశం లో ముసలం పుట్టింది అని గత కొద్ది రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతూనే ఉంది …ఈ క్రమం లో పార్టీ అధినేత తెలుగుదేశం ముఖ్యనాయాకులతో కొద్దిరోజుల క్రితం సమావేశం అయ్యి అందరు కలసిపని చెయ్యాలి అని రానున్న రోజులలో తెలంగాణాలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కూడా.
అయితే తెలంగాణా తెలుగుదేశం లో ఉన్న ముఖ్యనాయకులు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు అనేది జగమెరిగిన వాస్తవం …ఇందులో సగం మంది రానున్న ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని తద్వారా క్షేత్ర స్థాయిలో ఉన్న క్యాడర్ ని బలోపేతం చేసుకొని ముందు ముందు మళ్ళీ తెలంగాణా ప్రాంతం లో తెలుగుదేశం పార్టీ కి ఉన్న క్యాడర్ ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తుండగా మరో వర్గం మాత్రం ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి కే సి ఆర్ ని నమ్మలేము అని …గతం లో ఆయన రాజకీయ క్రీడ గురించి ప్రస్తావిస్తున్నారు …
కే సి ఆర్ ను తీవ్రంగా విభేదించే వారిలో అందరికంటే ముందు తెలుగుదేశం పార్టీ కి చెందిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఉన్నారు …గత కొద్ది కాలంగా రేవంత్ అధికార పక్షాన్ని ఇరుకుపెట్టే ప్రక్రియలో భాగంగా మొదటిరోజు నుంచి తెలుగుదేశం పార్టీ కి ప్రధమ శత్రువు అయిన కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు …అయితే తెలంగాణాలో ఇప్పడు ఉన్న పరిస్థితులలో తెలుగుదేశం కంటే కాంగ్రెస్ బలంగా ఉంది.ఈ రెండు ఈక్వేషన్స్ లో తెలుగుదేశం లో ఉండి పార్టీలోనే ఉన్న అంతర్గత భేధాబిప్రాయాలతో ముందుకు కదిలే కంటే కాంగ్రెస్ హై కమాండ్ నుంచి స్పష్టమయిన హామీ లభిస్తే కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనివిశ్వసనీయవర్గాల సమాచారం …
అయితే రేవంత్ కాంగ్రెస్ కి పెట్టిన కండిషన్ విని ఇప్పటికే తెలంగాణా లో వేళ్ళూనుకుపోయిన కాంగ్రెస్ నేతలు కలవరపడ్తున్నారు …రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తనని ముఖ్యమంత్రి అభ్యర్ధి గా ప్రకటిస్తే కాంగ్రెస్ లోకి రావటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తుంది …అయితే దీని పై కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ఒక పెద్ద తలకాయ గట్టిగానే లాబియింగ్ చేస్తున్నారంట…
అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే రేవంత్ రెడ్డి రానున్న సంక్రాంతి నాటికి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అని తెలుస్తుంది. మరి తెలుగుదేశం అధిష్టానం రేవంత్ విషయం లో ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.













