టీడీపీ ఆంధ్రుల పార్టీ కాదు… అందరి పార్టీ
టీడీపీ ఆంధ్రుల పార్టీ కాదని, అందరి పార్టీ అని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సృష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో రమణ మాట్లాడుతూ టీడీపీకి కార్యస్థలంలో మొక్కవోని కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్ ఒక్కరే ఓయూకు వెళ్లాలని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై విరోచిత పోరాటం చేశామని చెప్పారు. అన్ని స్థాయిల్లో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నుంచి కోదాడ వరకు టీడీపీ బలం ఉందన్నారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అని కేసీఆర్ అంటున్నారని, అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యావన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎలాంటి కారణం లేకుండానే అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను కూకటివేళ్ళతో పెకిలించడానికి, అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని సృష్టం చేశారు. టీడీపీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.













