టీటీడీపీ అధ్యక్షుడికి షాక్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుకు సొంత పార్టీలోనే గట్టి షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడైన ఎల్ రమణను మార్చాలంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక్కరే కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనను వ్యతిరేకిస్తూ సొంత వర్గంలోనే పలువురు సీనియర్ నాయకుల చంద్రబాబు లేఖ రాశారు.
అయితే కరోనా నేపథ్యంలో చంద్రబాబు ఎక్కువగా ఎవరినీ కలవడం లేదు. ప్రస్తుతం బాబు కోవిడ్ నేపథ్యంలోనే ఎక్కువ పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో తన నివాసంలోనే ఉన్నట్లు సమచారం. కొంతమంది సీనియర్ నాయకులతో పాటు పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూడా ఆ లేఖపై సంతకం పెట్టినట్లు తెలుస్తోంది. ఏడేళ్లుగా రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దిగజారిపోతోందని, అధ్యక్ష మార్పుతో పాటు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందని ఆ లేఖలో నేతలు పేర్కొన్నారు.













