జూన్ 2న రాష్ట్రావతరణ ఉత్సవాలు
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్సవాల సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రావతరణ ఉత్సవాల సందర్బంగా అమరులైన ఉద్యమ వీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని తెలిపింది. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ జరగాలని సూచించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రా స్థాయి ఉత్సవాలు జరిగే హైదరాబాద్లో సీఎం కేసీఆర్ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.













