తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు… ఇంటర్ వాయిదా
తెలంగాణలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. వీరందర్నీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని సర్కార్ నిర్ణయించింది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాతే ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ సీఎం కేసీఆర్కు ఫైల్ పంపింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం కూడా చేశారు.













