మంత్రి కొప్పుల ఈశ్వర్‍కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‍కు కరోనా పాజిటివ్ వచ్చింది. కొవిడ్ స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‍లోని యశోద దవాఖానలో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‍గా తేలింది. దీంతో ఆయన యశోదలోని ఐసోలేషన్‍లో ఉన్నారు. కొద్దిరోజులుగా తనను కలిసి వారందరూ కొవిడ్ పరీక్షలు చేయించుని జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. మూడు రోజుల కిందటే మంత్రి సతీమని స్నేహలత, కుమార్తె, అల్లుడికి కరోనా నిర్ధారణ అయింది. కుమార్తె, అల్లుడు హోం ఐసొలేషన్‍లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు మంత్రి దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.