ఆ నిర్ణయం గల్ఫ్ కార్మికులకు శాపం
విదేశాల్లో పనిచేసే వలస కార్మికుల కనీస వేతనాలు తగ్గించడంతో గల్ఫ్ దేశాల్లో పనిచేసే లక్షలాది మంది తెలంగాణ వాసులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు ట్విటర్ ద్వారా వివరించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు 30 నుంచి 50 శాతం తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ట్వీట్‌కు జత చేశారు. కొవిడ్, లాక్డౌన్ వల్ల వేతనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటూ వలస కూలీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని పేర్కొన్నారు. వలస కూలీల ప్రయోజనాలు కాపాడాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.













