తెలంగాణకు కేంద్రం శుభవార్త
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర సాంకేతిక సలహా మండలి కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో అనుమతులు ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి ఎంతో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో అడ్డంకులు తొలగిపోయాయి. సీడబ్ల్యూసీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ, అటవీ అనుమతులతో పాటు అన్ని అనుమతులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.













