యాదాద్రి మాదిరిగానే భద్రాద్రి
తెలంగాణలో యాద్రాది మాదిరిగానే భద్రాద్రీ కొత్త సొబగులు సంతరించుకోబోతోంది. నూతన ఆలయ నమూనా తుది రూపం తాజాగా ఖరారైంది. ప్రస్తుత ఆలయ మహారాజ గోపుర నమునాలో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆలయ ప్రాకారం, మాడవీధుల్లో మార్పులు చేపడుతారు. స్వామి వారి కల్యాణ మండపం, బ్రహ్మూెత్సవ మండపం, అన్నదాన సత్రాలను తిరిగి నిర్మిస్తారు. భద్రాద్రి ఆలయ ప్రాథమిక నమూనాను రూపొందించి ఇప్పటికే చినజీయర్ స్వామికి చూపించగా ఆయన సూచించిన మార్పులు, చేర్పులతో తిరిగి తుది నమూనా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పరిశీలన తర్వాత ఇదే తుది రూపంగా ఖరారు కానుంది.













