రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డులు అందుకున్న మంత్రి దయాకర్ రావు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు పురస్కారాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, జడ్పీ చైర్పర్సన్ అందుకున్నార. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు తెలంగాణ గెలుచుకోగా రాష్ట్రపతి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 46 అవార్డులు ప్రకటించగా, ఇందులో తొమ్మిది కేటగిరిలో తెలంగాణ 13 అవార్డులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.













