ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించిన అధికారులు సాయంత్రం 4 గంటల రకు దాదాపు 90 వాతం పోలింగ్ నమోదైనట్లు చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.













