Panchayat Elections: వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు (Sarpanches), ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు (Ward members), ఈ రోజు అంటే మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతారని, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారిందరిని సీఎం రేవంత్ శుభాంక్షలు తెలియజేశారు.






