తెలంగాణలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎల్.రమణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఒంటేరు యాదవరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలిలోని తన చాంబర్లో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీష్రావు, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శాసన మండలి విప్ ఎమ్ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహా చార్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.













