ఈ నెల 30న నూతన సచివాలయం ప్రారంభం!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభానికి ముస్తాబవుతోంది. 30న వేకువజామున 5 గంటల నుంచే సచివాలయ ప్రారంభోత్సవ పూజలు, హోమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9-10 గంటల్లోగా పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. మధ్యాహ్నం 1.10-1.20 గంటల మధ్యలో సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అనంతరం సీఎం తన కార్యాలయంలో కొలువుదీరుతారు. అదే సమయంలో సీఎంవో కార్యదర్ళులు సహా మంత్రులు, ఇతర కార్యదర్శులు తమ తమ కార్యాలయాల్లో ఆసీసులవుతారని తెలుస్తోంది.













