ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ అభినందనలు
తెలంగాణ శాసనసభ్యుల, స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వెంకట్రామిరెడ్డిలు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వారిని కేసీఆర్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ లలో అభ్యర్థులుగా ఏకగ్రీవంగా గెలవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మిగిలిన జిల్లాల నేతలు ఆదర్శంగా తీసుకొని ఎమ్మెల్సీ స్థానాలన్నింటిని గెలిపించాలన్నారు.













