ఘనంగా ప్రారంభమైన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో సంబంధిత జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జాతీయ పతాకాలను చేతబూని కొనసాగిన ఈ ర్యాలీలు కన్నుల పండగగా జరిగాయి. అనంతరం ఆయా నియోజక కేంద్రాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించి భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం కలయికకు దారితీసిన పరిస్థితులు, అనంతర కాలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కాక్యక్రమాల అమలుపై సంబంధిత ప్రజా ప్రతినిధులు వివరించారు. అనంతరం, అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.













