ఈ నెల 30 న మున్సిపల్ పోలింగ్… నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ఈసీ
తెలంగాణలో మున్సిపల్ పోల్స్‌కు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎలక్షన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 19న నామినేషన్ పత్రాల పరిశీలన, 22న నామినేషన్ ఉపసంహరణ గడువుగా విధించారు. ఈ నెల 30 న పోలింగ్ జరుగుతుంది. మే 3 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇక సిద్దిపేటలో 43, అచ్చంపేటలో 20, జడ్చర్లలో 27, కొత్తూరులో 12 వార్డులున్నాయి. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 66 డివిజన్లకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. 65 వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. 1,3,14,43,46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15,17,17,37,47,53 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు ఇచ్చారు. 9,16,23,25,32,33,36,38,42, 54 డివిజన్లను బీసీ మహిళలకు, 6,10,12,20,21,26,34,39,40, 41 డివిజన్లు బీసీ జనరల్‌కు కేటాయించారు. 8,11,19,24,28,29, 30,44,48,49,50,55,57,58,59,63 డివిజన్లను జనరల్ మహిళలకు కేటాయించారు.













