వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు !
వచ్చేనెల (ఆగస్టు) రెండో వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో కొత్త బిల్లులను ప్రవేశపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీ సమావేశపరచాలన్న రాజ్యాంగ నిబంధనను నిలబెట్టనున్నారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదంపై ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య ఇటీవల విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి బదులుగా ఇప్పటికే ఉన్న చట్టాలను సవరించడానికి సవరణ బిల్లులను ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. శానస ప్రక్రియాలో ప్రభుత్వానికి కొన్ని ఎదురుదెబ్బలు తగలడంతో ఈ సమావేశాల్లో ఆచితూచి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది.













