దేశంలోనే తొలిసారిగా.. తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ
దేశంలోనే తొలిసారిగా అతిపెద్ద వాహన తయారీ క్లస్టర్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ(టీఎంవీ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన మొబిలిటీ నెక్ట్స్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ మొబిలీటీ వ్యాలీ(టీఎంవీ) లో వాహనాల తరాయరీపైనే కాకుండా ఆటోమోటివ్ సాంకేతికతలో పరిశోధనకు కావల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇందుకు ప్రపంచంలోనే ప్రముఖ బిజినెస్ కన్సల్టింగ్ గ్రూపు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నామన్నారు. సస్టెయినబుల్ మొబిలిటీలోని అన్ని ఉప విభాగాల్లో ఇక్కడ వాహనాల తయారీకి అనువైన వాతావరణం ఉందన్నారు. టీఎంవీ రానున్న ఐదేళల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, 4 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు లక్ష్యంగా పెట్టుకుంటున్నామన్నారు.













